ప్రొడక్షన్ నెం1 పూజా కార్యక్రమాలతో లాంచ్
- August 10, 2025
గగన్ బాబు, కశికా కపూర్ హీరో హీరోయిన్స్ గా సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రలలో ఎ కె జంపన్న దర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం1 గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైయింది.
ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టారు. వివేక్ కూచిభట్ల కెమరా స్విచాన్ చేశారు. నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు, దర్శకుడు ఎ కె జంపన్న కి స్క్రిప్ట్ ఆందచేశారు. ఫస్ట్ షాట్ కు వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో పృద్వీ, మణిచందన, మహేష్ విట్టా, రంగస్థలం మహేష్ , నాగ మహేష్, ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవోపీ VK రామరాజు. JK మూర్తి ఆర్ట్ డైరెక్టర్.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో డైరెక్టర్ జంపన్న మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాహు , వివేక్, శంకర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.ఈ సినిమా కథని నిర్మాత కోటేశ్వరరావు తో చెప్పినప్పుడు సినిమా ఖచ్చితంగా తానే చేయాలని గోల్డెన్ ప్రొడక్షన్ అనే బ్యానర్ పెట్టి ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అన్ని రకాలుగా ముందుండి నడిపిస్తున్నారు. సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులు అందరికీ ధన్యవాదాలు. ఇదొక ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. చాలా లేయర్స్ ఉంటాయి. అందరూ మాట్లాడుకునే విధంగా ఉంటుంది. త్వరలోనే షూటింగ్ మొదలు పెడతాం. అందరికీ ధన్యవాదాలు.
నిర్మాత తోట లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ...అందరికి నమస్కారం. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పగానే నేనే ఒక బ్యానర్ ని స్టార్ట్ చేసి ఈ సినిమాని తీయాలనుకున్నాను. గోల్డెన్ ప్రొడక్షన్స్ లో వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. మా సినిమాకి మ్యూజిక్ ఇస్తున్న అనూప్ రూబెన్స్ గారికి థాంక్యూ సో మచ్. అలాగే ఇందులో నటించిన ప్రముఖ నటీనటులందరూ కథ నచ్చి తప్పకుండా చేస్తానని చెప్పారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అద్భుతమైన స్టోరీ ఇది. దేశం అంతా మాట్లాడుకునే విధంగా వుంటుంది.
హీరో గగన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాహు గారికి, వివేక్ గారికి, శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. అద్భుతమైన ఎమోషన్స్ వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ ఇది. నిర్మాత ఈ కథ విన్న వెంటనే తనే ప్రొడ్యూస్ చేస్తానని ముందుకు వచ్చారు. ఈ సినిమా కంప్లీట్ గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది క్లైమాక్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇది ప్యూర్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తాం.
హీరోయిన్ కశికా కపూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు.ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఇలాంటి మాస్టర్ పీస్ మూవీ లో భాగంగా చాలా ఆనందంగా ఉంది. ఈ మూవీ జర్నీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
నటీనటులు: గగన్ బాబు, సత్యం రాజేష్, సాయి రోనఖ్, కశికా కపూర్, పృద్వీ, మణిచందన, మహేష్ విట్టా, రంగస్థలం మహేష్, నాగ మహేష్, టెంపర్ వంశీ, కిల్లి క్రాంతి.
బ్యానర్: గోల్డెన్ ప్రొడక్షన్స్
నిర్మాత: తోట లక్ష్మీ కోటేశ్వరరావు
రచన, దర్శకత్వం: ఎ కె జంపన్న
సంగీతం: అనూప్ రూబెన్స్
DOP: VK రామరాజు
ఆర్ట్ డైరెక్టర్: JK మూర్తి
పీఆర్వో: వంశీ శేఖర్
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









