'పల్ పల్ దిల్ కే పాస్' –కిశోర్ కుమార్ జయంతి వేడుకల్లో మధుర గాన మాలిక

- August 10, 2025 , by Maagulf
\'పల్ పల్ దిల్ కే పాస్\' –కిశోర్ కుమార్ జయంతి వేడుకల్లో మధుర గాన మాలిక

హైదరాబాద్: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, ప్రముఖ సాంస్కృతిక సేవా సంస్థ శ్రీ కృష్ణ స్వర రాగ స్రవంతి ఆధ్వర్యంలో, అంతర్జాతీయ బహుభాషా, బహుగళ స్వర నిధి వై.ఎస్. రామకృష్ణ నిర్వహణలో, గంధర్వ గాయకుడు కిశోర్ కుమార్ 96వ జయంతి సందర్భంగా విశేష సంగీత కార్యక్రమం జరిగింది. “పల్ పల్ దిల్ కే పాస్” అనే శీర్షికతో నిర్వహించిన ఈ ప్రత్యేక గానసభ, శ్రీ త్యాగరాయ గాన సభ ప్రధాన మందిరంలో జంట నగరాల ప్రముఖ గాయనీ-గాయకులతో ఘనంగా జరిగింది.

ఈ సభకు విశ్రాంత డైరెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్, తెలంగాణ ప్రభుత్వం బి. రాజగోపాల్ ముఖ్య అతిథిగా హాజరై, “కిశోర్ కుమార్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయన స్వరం ఎప్పటికీ మధురంగా, అమరంగా నిలుస్తుంది” అని ప్రశంసించారు. కళాబ్రహ్మ, శిరోమణి వంశీ రామరాజు మాట్లాడుతూ, “ఇంత అందమైన గాన కార్యక్రమాన్ని రామకృష్ణ నిర్వహించడం హర్షణీయం” అని అన్నారు.

కార్యక్రమంలో రామకృష్ణ మరియు వారి బృందం, కిశోర్ కుమార్ పాడిన ఏకగళ, ద్విగళ గీతాలు — ప్యార్ కా డర్డ్ హై, ఓ సాతీ రే, జై జై శివ్ శంకర్, కొరా కాగజ్ థా, మేరే సప్నోన్ కి రాణి — వంటి మధుర గీతాలను ఆహ్లాదకరంగా ఆలపించి శ్రోతలను అలరించారు.

ఈ గానసంధ్యలో వై.ఎస్. రామకృష్ణ, గంటి రామకృష్ణ, కశ్యప్, కే.వి. రావు, దేవకృష్ణ, రామసుబ్రహ్మణ్యం, రాజగోపాల్, లలిత, మధుర వీణ, గంటి శైలజ, ఆరతి, అనిత తమ గాత్రాన్ని అందించారు. ఎన్. లలిత హిందీ వ్యాఖ్యానం అద్భుతంగా సమర్పించి కార్యక్రమానికి మరింత అందాన్ని చేకూర్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com