పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన ఆర్జీవీ

- August 12, 2025 , by Maagulf
పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన ఆర్జీవీ

పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రైన రామ్‌గోపాల్ వ‌ర్మ‌

ఒంగోలు: ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ వివాదం నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలంటూ వర్మకు నోటీసులు జారీ చేసిన ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు, స్టేషన్‌లో విచారణ చేపట్టారు. వర్మ తగిన సమయానికి హాజరయ్యారు.

గత వైసీపీ (YCP) ప్రభుత్వానికి వ్యతిరేకంగా రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రచారంలో భాగంగా, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేశ్‌ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారన్న ఆరోపణలు రామ్ గోపాల్ వర్మపై వచ్చాయి. దీని ఆధారంగా 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరి 7న వర్మ విచారణకు హాజరయ్యారు. అయితే, విచారణ కొనసాగిస్తూ మళ్లీ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు మరోసారి పోలీసుల ముందు హాజరయ్యారు.ప్రస్తుతం వర్మను ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. విచారణ ముగిసిన తర్వాత కేసు పురోగతి పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com