సౌదీయేతరుల డిజిటల్ ID వినియోగానికి సౌదీ అరేబియా ఆమోదం..!!
- August 16, 2025
రియాద్: సౌదీయేతర, ప్రవాస విదేశీయులు ప్రాపర్టీని కొనుగోలు చేసేందుకు వీలుగా సౌదీ అరేబియా మంత్రివర్గం డిజిటల్ ID వినియోగాన్ని ఆమోదించింది. సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ , జాతీయ సమాచార కేంద్రం మరియు ఇతర సంబంధిత సంస్థలతో సమన్వయం డిజిటల్ ఐడీలను యాక్టివేట్ చేస్తున్నట్లు జనరల్ రియల్ ఎస్టేట్ అథారిటీ వెల్లడించింది. సౌదీయేతర రియల్ ఎస్టేట్ యాజమాన్య చట్టం అమలుకు ఇది దోహదం చేస్తుందన్నారు.
సౌదీయేతరుల ప్రాపర్టీ మేనేజ్ మెంట్, వినియోగ హక్కులపై ఆర్థిక మరియు అభివృద్ధి వ్యవహారాల మండలి తీసుకున్న నిర్ణయాన్ని కూడా సౌదీ అరేబియా కేబినెట్ ఆమోదించింది. ఈ విషయాలను పర్యవేక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందులో వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు మరియు ముగ్గురు ప్రైవేట్ రంగ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
కాగా, జూలై నెలలో సౌదీయేతర రియల్ ఎస్టేట్ యాజమాన్య చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే. ఇది జనవరి 2026 నుండి అమలులోకి వస్తుంది. దీని ప్రకారం నివాసితులు కాని విదేశీయులు అబ్షర్ ప్లాట్‌ఫామ్ ద్వారా డిజిటల్ IDని పొందాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!