ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్

- August 17, 2025 , by Maagulf
ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా C.P.రాధాకృష్ణన్

న్యూ ఢిల్లీ: జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ఖరారు చేసింది. భారతీయ జనతా పార్టీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తమిళనాడులో జన్మించిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశ అత్యున్నత పదవుల్లో ఒకటైన ఉపరాష్ట్రపతి పదవికి ఆయన నామినేషన్ వేయబోతున్నారు.

సీపీ రాధాకృష్ణన్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. తమిళనాడు బీజేపీలో కీలక పాత్ర పోషించిన ఆయన, కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆయనకు పార్టీలో బలమైన పట్టు ఉంది. ఆయన రాజకీయ జీవితంలో వివిధ పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.ఈ అనుభవం ఉపరాష్ట్రపతి పదవికి ఎంతో ఉపయోగపడుతుందని ఎన్డీఏ భావిస్తోంది.

మహారాష్ట్ర గవర్నర్‌గా రాధాకృష్ణన్ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారు.గవర్నర్‌గా ఆయన చేసిన సేవలను గుర్తించి, బీజేపీ అధిష్టానం ఆయనను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ నిర్ణయం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ సంకేతాలు పంపిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాధాకృష్ణన్ నామినేషన్ తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com