సీపీ రాధాకృష్ణన్ ను కలిసిన ప్రధాని మోదీ
- August 18, 2025
న్యూ ఢిల్లీ: మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్న సీపీ రాధాకృష్ణన్, సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.సీపీ రాధాకృష్ణన్ గారిని కలిశాను. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనందుకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో ఆయన అనుభవం దేశానికి ఉపయోగపడుతుంది. అదే అంకితభావంతో కొనసాగుతారని నమ్మకముంది, అని మోదీ పేర్కొన్నారు.రాధాకృష్ణన్ కూడా ఈ భేటీపై స్పందిస్తూ, ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఎన్డీఏ అభ్యర్థిగా రాధాకృష్ణన్ ఎంపికను స్వాగతించారు.ఇది మంచి నిర్ణయం. జేడీయూ పూర్తి మద్దతు ఇస్తుంది, అంటూ నితీశ్ కుమార్ స్పష్టం చేశారు.జేడీయూకు లోక్‌సభలో 12, రాజ్యసభలో 4 స్థానాలు ఉన్నాయి. ఈ మద్దతు ఎన్డీఏకు కీలకంగా మారుతుంది.రాజకీయ సమీకరణాలపై బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టింది. ఇతర పార్టీల మద్దతు కోసం చర్యలు మొదలయ్యాయి. ఈ బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేపట్టారు.తమిళనాడు సీఎం స్టాలిన్, వైఎస్ జగన్‌లతో రాజ్‌నాథ్ ఫోన్‌లో మాట్లాడారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరారు. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌కు రాష్ట్ర పార్టీ మద్దతు దొరకడం గెలుపు అవకాశాలను పెంచుతుంది.
ఇందాకా ఎన్డీఏ అభ్యర్థి పై దృష్టి కేంద్రీకృతమైంది కానీ, నేడు ఇండియా కూటమి నుంచి కూడా అభ్యర్థిని ప్రకటించనున్నారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.భాగస్వామ్య పక్షాలతో చర్చలు జరుగుతున్నాయి. సోమవారం అభ్యర్థిని ప్రకటిస్తాం, అని ఆయన తెలిపారు.67 ఏళ్ల సీపీ రాధాకృష్ణన్ రాజకీయంగా అనుభవజ్ఞుడు. కోయంబత్తూరు నుంచి రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో బలమైన అనుబంధం ఉంది. ఓబీసీ వర్గానికి చెందిన ఆయన, పార్టీ శ్రేణుల్లో విశ్వాసాన్ని గెలుచుకున్నారు.ఇప్పటికే బలంగా ఉన్న ఎన్డీఏ, మిత్రపక్షాల మద్దతుతో మరింత మెరుగైన స్థితిలోకి వస్తోంది. అయితే ఇండియా కూటమి అభ్యర్థి ఎవరు? ఎంత మేర మద్దతు సంపాదించగలరు? అన్నది వేచి చూడాల్సిందే.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!