మమ్ముట్టి ఆరోగ్యం పై కీలక అప్ డేట్...

- August 20, 2025 , by Maagulf
మమ్ముట్టి ఆరోగ్యం పై కీలక అప్ డేట్...

త్రివేండ్రం: మలయాళ సినీ ఇండస్ట్రీకి గర్వకారణమైన మెగాస్టార్ మమ్ముట్టి ఆరోగ్యం పై నెలలుగా నెలకొన్న అనిశ్చితికి ఇక తెరపడింది. ఇటీవల ఆయన సోదరుడు ఇబ్రహీంకుట్టి ఒక భావోద్వేగంతో కూడిన సోషల్ మీడియా పోస్టు ద్వారా, మమ్ముట్టి పూర్తిగా కోలుకున్నారని ప్రకటించారు. ఈ ప్రకటనతో అభిమానులు, సినీ ప్రముఖులు, ఆయన కుటుంబ సభ్యులే కాకుండా, సినీ ప్రేమికులంతా ఊపిరి పీల్చుకున్నారు. “కారుమబ్బులు కమ్మిన సముద్రాన్ని దాటి వచ్చిన ఓ నావలా ఇప్పుడు నేడు ఊపిరి పీల్చుకుంటున్నాను” అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు ఆయన.

ఇటీవల పలువురు ప్రముఖులు మమ్ముట్టి ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో(Social Media) పోస్టులు పెట్టారు. దీంతో అభిమానుల మధ్య సందిగ్ధత, ఆందోళన మరింత పెరిగింది. కానీ ఈ అనుమానాలన్నింటికీ ముగింపు పలుకుతూ, ఇబ్రహీంకుట్టి, మమ్ముట్టి త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్‌లలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ప్రజల ప్రేమ, ప్రార్థనలు అతని కోలుకోవడంలో ఎంతో భాగం అయినట్టు పేర్కొన్నారు. ‘‘ప్రతి ఊర్లో, వీధిలో ప్రజలు నా వద్దకి వచ్చి, మా మమ్మూక్ ఎలా ఉన్నారు అని అడగడం చూస్తే ఆశ్చర్యంగా అనిపించేది,’’ అని ఆయన అన్నారు.

ఈ పరిస్థితులపై స్పందించిన మరో సినీ ప్రముఖుడు వెల్లడించిన వివరాల ప్రకారం, మమ్ముట్టికి కొన్ని రోజులు ఆహారానికి రుచి తెలియకపోవడం వంటి చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయని, కానీ ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని స్పష్టం చేశారు. మమ్ముట్టి ఆరోగ్యం మళ్లీ మెరుగవుతున్నట్టు తెలిసిన తర్వాత ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఆనందావేశంతో తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆయన రీ-ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తగా నిలిచింది.

ఈ కష్టకాలంలో మమ్ముట్టికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, వారి ప్రేమాభిమానాలు, ప్రార్థనలకు కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. “ఇచక్కపై చూపిన అపారమైన ప్రేమకు నేను జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ ఆయన సోదరుడు అభిమానం వ్యక్తం చేశారు. ఇప్పుడు మమ్ముట్టి తిరిగి కెమెరా ముందు అడుగులు వేయడానికి సిద్ధమవుతుండటంతో, మలయాళ సినీ ప్రపంచం తిరిగి కళకళలాడే రోజులు దూరం కాదన్న నమ్మకం అభిమానుల్లో ఏర్పడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com