రెస్టారెంట్ యజమానికి 3 ఏళ్ల జైలుశిక్ష విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- August 21, 2025
మనామా: బహ్రెయిన్ లో 50 ఏళ్ల రెస్టారెంట్ యజమానికి మూడవ హై క్రిమినల్ అప్పీల్స్ కోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన కేసులో ఈ శిక్ష విధించింది. ఆరాడ్ భవనం కూలిపోయిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు.
కాగా, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రాథమిక తీర్పును అప్పీల్ చేసింది. నిందితుడి నిర్లక్ష్యం ఈ విషాదానికి దారితీసిందని వాదించింది. భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం వల్ల రెస్టారెంట్ నుండి గ్యాస్ లీక్ కావడం వల్ల మొత్తం భవనం కూలిపోయిన పేలుడు సంభవించిందని దర్యాప్తులో కూడా తేలిందని పేర్కొంది.
రెస్టారెండ్ యజమాని భద్రతా పరమైన అనుమతులు పొందకుండా రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడని, ఆమోదం లేని గ్యాస్ డిటెక్షన్ వ్యవస్థలను ఉపయోగించాడని అధికారులు నిర్ధారించారు. భద్రత మరియు చట్టపరమైన అవసరాలను పాటించడంలో విఫలమైనందుకు కోర్టు అతడిని దోషిగా నిర్ధారించి జైలుశిక్ష విధించింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్