ఇంజినీరింగ్ ఫీజు పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- August 21, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన శుభవార్త వచ్చింది. ఇకపై ఈ కళాశాలల్లో ఫీజు పెంపు యథేచ్ఛగా జరగదు.ఇంజినీరింగ్, డిప్లొమా తదితర వృత్తి విద్యా కళాశాలలు ఇక నుండి ప్రభుత్వ నిబంధనల ప్రకారం మాత్రమే ఫీజులు వసూలు చేయాలి. ఈ విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టంగా మార్గదర్శకాలు నిర్దేశించాయి.ఫీజులు పెంచాలని కళాశాలలు కోరితే, ముందుగా వారి ఆర్థిక లెక్కలతో పాటు విద్యా ప్రమాణాలను పరిశీలిస్తారు. అంటే, కళాశాలలు ఎంత నాణ్యత కలిగిన విద్యను అందిస్తున్నాయన్నదే కీలకం అవుతుంది.ప్రతి కళాశాలలో విద్యార్థుల హాజరును కచ్చితంగా పరిశీలించనున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా హాజరు తీసుకుంటున్నారా? అనే అంశం తప్పనిసరిగా పరిశీలనలోకి వస్తుంది.
విద్యార్థులు ఫీజులు చెల్లించడంలో ఆధార్ ఆధారిత సిస్టమ్‌ను పాటిస్తున్నారా అనే అంశం కూడా ముఖ్యమైనది. ఈ విధానం వల్ల పారదర్శకత పెరుగుతుంది.ఇంజినీరింగ్, వృత్తి విద్యా రంగాల్లో పరిశోధనకు ప్రాధాన్యత చాలా ఎక్కువ. కాలేజీలు విద్యార్థులను ఈ దిశగా ప్రోత్సహిస్తున్నాయా అనే అంశాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటోంది.కళాశాలలో చదివిన విద్యార్థులు ఉద్యోగాలు పొందుతున్నారా? మంచి కంపెనీలలో ప్లేస్మెంట్లు వస్తున్నాయా? అనే అంశాల మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఫీజు నిర్ధారణలో ఇది కీలకమైన పాత్ర పోషిస్తుంది.ఆ కళాశాలకి ఉన్న నేషనల్, ఇంటర్నేషనల్ ర్యాంకింగ్‌లను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ర్యాంకింగ్‌లు ఎంత ఉన్నాయో అనేదే, కళాశాల స్థాయి తెలియజేస్తుంది.
కాలేజీలు ప్రభుత్వ నిబంధనలను ఎంత మేరకు పాటిస్తున్నాయో కూడా తేల్చుకుంటారు. అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే ఫీజుల పెంపు ఆమోదించబడుతుంది.ఈ నిర్ణయంతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న కొంతమంది కాలేజీలపై నియంత్రణ వస్తుంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







