దుబాయ్ లో 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్..!!
- August 22, 2025
యూఏఈ: దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇకపై 6 సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ పొందవచ్చు. కొత్త AI-ఆధారిత స్మార్ట్ కారిడార్‌లో సెకన్లలో ఇమ్మిగ్రేషన్ క్లియర్ అవుతుందని అధికారులు తెలిపారు. పీక్ ట్రావెల్ సీజన్లో టెర్మినల్ 3లో కౌంటర్లు, డాక్యుమెంట్ తనిఖీలు లేదా పాస్‌పోర్ట్ స్కాన్లు లేకుండా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేయవచ్చు.
ఏఐ ఆధారిత సెన్సార్లు ప్రయాణీకులు వెళ్లే సమయంలోనే వారి ఫేస్ లను స్కాన్ చేయడంతో ఇది సాధ్యమవుతుందని అధికారులు వివరించారు. కారిడార్ చివరిలో ప్రయాణీకుడి ఫోటో, విమాన వివరాలు మరియు టైమ్‌స్టాంప్‌తో పాటు "ఇమ్మిగ్రేషన్ విధానం పూర్తయింది" అనే సందేశాన్ని స్క్రీన్ ఫ్లాష్ చేసింది. ఈ ప్రక్రియ మొత్త పూర్తయేందుకు 6 సెకన్ల టైమ్ మాత్రమే పడుతుందన్నారు.
ప్రస్తుతం ఈ కారిడార్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉందని, రాబోయే రోజుల్లో ఎయిర్ పోర్టులోని అన్ని కారిడార్లకు ఈ ఏఐ టెక్నాలజీని విస్తారించే ప్రణాళికలు ఉన్నాయని అన్నారు. ఈ వ్యవస్థ ఒకేసారి 10 మంది ప్రయాణికులను ప్రాసెస్ చేయగలదని, సీనియర్ సిటిజన్లు మరియు వీల్చైర్లను ఉపయోగించే వ్యక్తులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందన్నారు.
ఈ కారిడార్ ఇమ్మిగ్రేషన్ను వేగవంతం చేయడమే కాకుండా భద్రతను కూడా పెంచుతుందని దుబాయ్‌లోని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ మొహమ్మద్ అహ్మద్ అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







