2026లో ఖతార్ ఆర్థిక వృద్ధి 4.8 శాతం..!!

- August 22, 2025 , by Maagulf
2026లో ఖతార్ ఆర్థిక వృద్ధి 4.8 శాతం..!!

దోహా: ఖతార్ ఆర్థిక వ్యవస్థ ఇంధనేతర రంగాలలో సంస్కరణలలో స్థిరమైన పురోగతిని నమోదు చేస్తోంది. 2026లో వృద్ధి 4.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ గత సంవత్సరం 3.7 శాతం వృద్ధి చెందిందని కుష్మాన్ & వేక్‌ఫీల్డ్ తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా వాణిజ్యం, రిటైల్, వసతి మరియు ఆహార సేవలలో స్పష్టమైన వృద్ధి నమోదైనట్లు పేర్కొంది.  

జూన్ నెలకు సంబంధించి కొనుగోలు నిర్వాహకుల సూచిక (PMI) మూడు నెలల గరిష్ట స్థాయి 52కి పెరిగింది, ఇది Q1లో 51.1 నుండి Q2 సగటును 51.2గా నమోదైనట్లు నివేదికలో వెల్లడించింది.

ఖతార్‌లో ద్రవ్యోల్బణం అత్యల్పంగా ఉందని, ఇది కొనుగోలు శక్తి మరియు వ్యాపారానికి మద్దతు ఇస్తుందన్నారు.  మరోవైపు ఇంధన సామర్థ్యం కూడా పెరుగుతుందని, 2030 నాటికి సంవత్సరానికి 142 మిలియన్ టన్నుల సామర్థ్యాన్ని సాధిస్తుందని తెలిపింది. నార్త్ ఫీల్డ్ ఈస్ట్ ప్రాజెక్ట్ నుండి మొదటి ఉత్పత్తి 2026 మధ్యలో జరగనుందని, ఇది ప్రపంచ గ్యాస్ సరఫరాదారుగా ఖతార్ స్థానాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

మరోవైపు, ఖతార్ టూరిజం మెరుగైన గణంకాలను నమోదు చేసింది. పర్యాటకుల రాకపోకలు మొదటి అర్ధభాగంలో 3 శాతం పెరిగి 2.6 మిలియన్లకు చేరుకున్నాయి.  హోటల్ ఆక్యుపెన్సీ 71 శాతంగా ఉంది. మొత్తంగా ఖతార్ ఆర్థిక క్రమశిక్షణ, నిర్మాణాత్మక సంస్కరణలు మెరుగైన ఫలితాలను ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com