మహిళల వన్డే ప్రపంచకప్ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు..
- August 22, 2025
బెంగళూరు: సెప్టెంబర్ 30 నుంచి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.ఇప్పటికే ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయగా..తాజాగా ఈ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మెగా టోర్నీలోని కొన్ని మ్యాచ్‌లకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.
అయితే.. ఆ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి నవీ ముంబైకి తరలించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో మూడు లీగ్ మ్యాచ్‌లు, ఓ సెమీఫైనల్, ఫైనల్‌తో సహా ఐదు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే.. బెంగళూరు నుంచి నవీ ముంబైకి మ్యాచ్‌లు తరలించడానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
‘ఊహించని పరిస్థితుల కారణంగా షెడ్యూల్‌ను సర్దుబాటు చేసి, వేదికను మార్చాల్సి వచ్చినప్పటికీ, మహిళల ఆటలోని అత్యుత్తమ ప్రదర్శనలను ప్రదర్శించే ఐదు ప్రపంచ స్థాయి వేదికల శ్రేణిని కలిగి ఉండటం మాకు సంతోషంగా ఉంది. వేదిక సిద్ధమైంది.. ఈ టోర్నమెంట్ అభిమానులను అలరిస్తుందని ఆశిస్తున్నాం.’ అని ఐసీసీ ఛైర్మన్ జైషా అన్నారు.
8 జట్లు కప్పు కోసం పోటీపడుతున్నాయి. నవీ ముంబైతో పాటు గౌహతి, ఇండోర్, విశాఖపట్నం, కొలంబో లు ఇతర వేదికలుగా ఉన్నాయి. ఐసీసీ ఖచ్చితమైన కారణాలను వెల్లడించనప్పటికి.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ చిన్నస్వామిలో మ్యాచ్‌లను నిర్వహించేందుకు అవసరమైన అనుమతులను పొందలేకపోయినట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్‌సీబీ చిన్నస్వామి వేదికగా విజయోత్సవ వేడుకలను నిర్వహించింది. ఈ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో పలువురు అభిమానులు మరణించారు. తొక్కిసలాట ఘటనపై విచారణ తరువాత చిన్నస్వామి స్టేడియంలో పెద్ద ఈవెంట్లను నిర్వహించకూడని పేర్కొన్న సంగతి తెలిసిందే.
మహిళల వన్డే ప్రపంచకప్ రీవైజ్ షెడ్యూల్ ఇదే..
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్