విమానాశ్రయానికి సెల్ఫ్ డ్రైవింగ్ కారులో రియాద్ డిప్యూటీ ఎమిర్..!!
- August 23, 2025
రియాద్: రియాద్ డిప్యూటీ ఎమిర్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్‌రెహ్మాన్, సౌదీ అరేబియా ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ సలేహ్ అల్-జాసర్తో కలిసి, రియాద్ వీధుల గుండా కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సెల్ఫ్ డ్రైవింగ్ వాహనంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా వారు అనేక ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహించారు.
వీరి ప్రయాణం రోష్న్ ఫ్రంట్ వద్ద ప్రారంభమై విమానాశ్రయ టెర్మినల్స్ వద్ద ముగిసింది. రియాద్ లో ఎంపిక చేసిన ప్రదేశాలలో మొదటి దశ సెల్ఫ్ డ్రైవింగ్ సేవలను ప్రారంభించడంపై ట్రయల్ నిర్వహించాలని సూచించారు.
అనంతరం ప్రిన్స్ మొహమ్మద్ అంతర్జాతీయ టెర్మినల్ 1 అండ్ 2 వద్ద అభివృద్ధి పనులను పరిశీలిచారు. అంతకుముందు విమానాశ్రయానికి చేరుకున్న డిప్యూటీ గవర్నర్‌ను జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధ్యక్షుడు అబ్దులాజీజ్ అల్-దువైలెజ్ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







