పసిడి ధర తగ్గింది..
- July 18, 2016
గత కొన్ని రోజులుగా పైపైకి పోతున్న బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రపంచమార్కెట్ల ప్రభావం, డిమాండ్ లేమితో సోమవారం బంగారం ధర రూ. 200 తగ్గి రెండు వారాల కనిష్ఠానికి చేరింది. దీంతో దేశీయ మార్కెట్లో పది గ్రాముల పసిడి ధర రూ.30,550గా ఉంది. నగల వ్యాపారుల నుంచి కొనుగోళ్లు లేకపోవడంతో ధరలు తగ్గినట్లు బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. సింగపూర్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,323.83 అమెరికన్ డాలర్లుగా ఉంది.
బంగారం దారిలోనే వెండి వెండి ధర కూడా నేడు రూ. 240 తగ్గింది. దీంతో కేజీ వెండి ధర రూ. 46,260గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో ధర తగ్గిందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







