నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా..
- July 18, 2016
సీనియర్ భాజపా నేత, ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా చేశారు. సిద్ధూ రెండు నెలల క్రితమే నామినేటెడ్ ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్, గతంలో అమృత్సర్ లోక్సభ ఎంపీ అయిన సిద్ధూను 2014 లోక్సభ ఎన్నికల్లో అరుణ్ జైట్లీ కోసం అక్కడి నుంచి తప్పించారు. ఆ స్థానం నుంచి జైట్లీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూ 2004 నుంచి 2014 వరకు అమృత్సర్ ఎంపీ. ఆయన భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ కూడా భాజపా సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీ ఎమ్మెల్యే.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







