ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త!
- July 18, 2016
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు శుభవార్త! 2జీ, 3జీ, 4జీ డేటా ప్యాక్‌లపై 67శాతం అదనపు డేటా ఇవ్వనున్నట్లు ఎయిర్‌టెల్ ప్రకటించింది. ఇప్పటి వరకు రూ.655తో రీఛార్జి చేయించుకుంటే 3జీబీ డేటా వచ్చేది. దాన్ని 5జీబీకి పెంచారు. చిన్న డేటా ప్యాక్‌లపై కూడా అదనపు డేటా సౌకర్యాన్ని ఎయిర్‌టెల్ అందిస్తోంది. 25తో రీఛార్జి చేయించుకుంటే 100 ఎంబీకి బదులు 145 ఎంబీ, రూ.145 రీఛార్జితో 440 ఎంబీకి బదులు 580 ఎంబీ డేటాను ఇస్తోంది. సవరించిన టారిఫ్‌లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.
మరో ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఐడియా సైతం ఇటీవల తమ వినియోగదారులకు అదనపు డేటా సౌకర్యం కల్పించింది. 2జీ, 3జీ, 4జీ ప్యాక్‌లపై 45 శాతం అదనపు డేటాను అందించనున్నట్లు ప్రకటించింది.రిలయన్స్ జియో నుంచి పోటీని తట్టుకోవడానికే ఇలా మొబైల్ సంస్థలన్నీ ఆఫర్లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో జియో సేవలు అందుబాటులోకి రానున్నాయన్న వార్తల నేపథ్యంలో మొబైల్ ఆపరేటర్లు ఇలా వరుస ఆఫర్లు ప్రకటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







