GATE 2026 అప్డేట్.. రిజిస్ట్రేషన్స్ షెడ్యూల్ విడుదల..

- August 24, 2025 , by Maagulf
GATE 2026 అప్డేట్.. రిజిస్ట్రేషన్స్ షెడ్యూల్ విడుదల..

ఐఐటీ గౌహతి గేట్ 2026 (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) రిజిస్ట్రేషన్ ప్రక్రియ షెడ్యూల్ ను విడుదల చేసింది. ఆగస్ట్​ 25, 2025 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుకానున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు(GATE 2026) అధికారిక వెబ్‌సైట్ http://gate2026.iitg.ac.in నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 25వ తేదీ వరుకు కొనసాగనుంది. ఆలస్య రుసుముతో అక్టోబర్ 6, 2025 వరకు రిజిస్టర్ చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము:

  • మహిళలు, ఎస్​సీ, ఎస్​టీ, దివ్యాంగుల (PWD)కు ప్రతి పేపర్‌కు రూ.1000, లేట్ ఫీజుతో రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది.
  • ఇతర అభ్యర్థులు రూ. 2000, లేట్ ఫీజుతో రూ. 2500 చెల్లించాల్సి ఉంటుంది.
  • గేట్ 2026 ముఖ్యమైన తేదీలు:
  • గేట్​ 2026 పరీక్ష ఫిబ్రవరి 7,8,14,15వ తేదీలలో రెండు షిఫ్టులలో జరుగుతాయి.
  • మొదటి షిఫ్ట్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది.
  • రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ఉంటుంది.
  • గేట్ 2026 రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోండి:
  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ http://gate2026.iitg.ac.in లోకి వెళ్ళాలి.
  • హోమ్ పేజీలో “గేట్ 2026 రిజిస్ట్రేషన్ లింక్”పై క్లిక్ చేయాలి.
  • తరువాత అభ్యర్థులు తమ వివరాలను ఎంటర్ చేసుకోవాలి.
  • తరువాత మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • దరఖాస్తు ఫామ్‌ను ఫిల్ చేసి ఫీజు పే చేయాలి
  • తరువాత సబ్మిట్​ బటన్ పై క్లిక్ చేయాలి
  • భవిష్యత్ అవసరాల కోసం దరఖాస్తు పత్రాన్ని ప్రింటౌట్ తీసుకోవాలి.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com