కువైట్‌లో తగ్గిన సోలార్ పవర్ ఉత్పత్తి..!!
- August 24, 2025
కువైట్: కువైట్ మరియు ఇతర అరబ్ దేశాలలో దుమ్ము తుఫానుల కారణంగా సోలార్ పవర్ ఉత్పత్తిలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. సోలార్ పవర్ ఉత్పత్తి 25% నుండి 35% వరకు తగ్గుతుందని, మరియు కొన్ని సందర్భాల్లో తీవ్రమైన తుఫానుల సమయంలో 50% కంటే ఎక్కువ తగ్గుతుందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. అరబ్ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఎనర్జీ వైస్ చైర్మన్ డాక్టర్ బదర్ అల్-తవిల్ రూపొందించిన ఈ అధ్యయనం, గాలిలో దుమ్ము కణాలు సోలార్ ప్లేట్స్ పై చేరడంతో వాటి సామర్థ్యాన్ని తగ్గుతుందని, ప్యానెల్ సామర్థ్యాన్ని వేగంగా తగ్గిస్తుందని పేర్కొన్నారు. వీటిని క్లీనింగ్ చేయడానికి కూడా ఖర్చు పెరుగుతుందని వెల్లడించారు.
దుమ్ము తుఫానులు పర్యావరణ అవాంతరాలు మాత్రమే కాదని, ఈ ప్రాంతంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన అడ్డంకులలో ఒకటి అని నిపుణులు చెప్పారు. కఠినమైన ఎడారి వాతావరణాలలో సోలార్ ప్లేట్స్ పనితీరును మెరుగుపరచడానికి దుమ్ము-నిరోధక పదార్థాలు, ఆటో క్లీనింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..