యూఏఈలో గామా అవార్డ్స్ ఈవెంట్.. హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్..
- August 25, 2025
హైదరాబాద్: గామా అవార్డ్స్ GAMA–(Gulf Academy Movie Awards) 2025 సంవత్సరానికి 5వ ఎడిషన్ గ్రాండ్ గా జరగనుంది.దుబాయ్‌లో ఇప్పటికే నాలుగు ఎడిషన్లు జరగ్గా 5వ ఎడిషన్ వేడుకలు ఆగస్ట్ 30న యూఏఈలోని షార్జా ఎక్స్‌పో సెంటర్‌లో గ్రాండ్‌గా జరగనుంది.తాజాగా నేడు ఈ ఈవెంట్ కి సంబంధించి హైదరాబాద్ లో కర్టెన్ రైజర్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి గామా సీఈవో సౌరబ్ కేసరి, మెయిన్ స్పాన్సర్ వైభవ్ జ్యువెలర్స్ ఎండి రాఘవ్, జ్యూరీ సభ్యులు ఏ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్ తో పాటు హీరోయిన్స్ ఫరియా అబ్దుల్లా, మానస వారణాసి, దక్షా నాగర్కర్, నటుడు వైవా హర్ష పాల్గొన్నారు.
గామా కర్టెన్ రైజర్ ఈవెంట్లో గామా సీఈవో సౌరబ్ కేసరి మాట్లాడుతూ..మా నాన్నకి కళాకారులపై ఉన్న అభిమానంతో గామా అవార్డ్స్ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం.వచ్చే ఏడాది మరింత గ్రాండ్ గా అవార్డ్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నాం.ఇతర దేశాల్లోను గామా అవార్డ్స్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాం.యూఏఈలో ఉన్న తెలుగు వారితోపాటు ప్రపంచంలోని తెలుగు వారందరినీ అబ్బురపరిచేలా ఈవెంట్ ఉంటుంది అని అన్నారు.
జ్యూరీ సభ్యులు,దర్శకులు ఏ.కోదండ రామిరెడ్డి, బి.గోపాల్ మాట్లాడుతూ..ఈ అవార్డ్స్ లో భాగమైనందుకు సంతోషంగా ఉంది.మేము, కోటి సహా పలువురు ప్రముఖులు జ్యురీ సభ్యులుగా ఉన్నాం.అవార్డ్స్ నటీనటులకు మల్టీ విటమిన్ టాబ్లెట్స్ లాంటివి.షార్జాలో ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది అని అన్నారు.ఈ ఈవెంట్ కు మాగల్ఫ్ న్యూస్ సపోర్టింగ్ పార్టనర్ గా వ్యవహరిస్తోంది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!