ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- November 28, 2025
మచిలీపట్నం: మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని వివిధ నియోజక వర్గాలలో వైద్య సహాయం నిమిత్తం ఎంపి బాలశౌరి సిఫారసు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం నుండి నిధులు మంజూరు చేస్తూ వచ్చిన చెక్కులను సంబందిత వ్యక్తులకు మచిలీపట్నం లోని ఎంపి గారి క్యాంపు కార్యాలయంలో రోజు పంపిణి చేయడం జరిగింది.
ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చెక్కులను పొందిన వారిలో మచిలీపట్నంలోని పరాసుపేటకు చెందిన కమ్మిలి నాగ శ్రీదేవికి రూ.1,31,952/-, మచిలీపట్నం లోని వాడపాలెం కు చెందిన బండి లక్ష్మి కి రూ.65,141/-, మచిలిపట్నంలోని మేకవానిపాలెం కు చెందిన శ్రీ వాలి శ్రీనివాసరావుకి రు. 21,986/-, మొవ్వ మండలంలోని కూచిపూడి కి చెందిన శ్రీ పోరంకి రాజ కుమార్కి రూ.35,348/-, మచిలీపట్నంలోని చిలకలపూడి కు చెందిన సూరిశెట్టి సుబ్రహ్మణ్యేశ్వరికి రూ.39,595/-, పెడన మండలంలోని పెడన కు చెందిన సిరాపు నాగలక్ష్మి కి రూ.20,000/- పెడన మండలంలోని పెడనకు చెందిన అమృత దుర్గ గారికి 20,000/-, మచిలీపట్నం లోని సర్కిల్ పేటకు చెందిన గుండు బాల వెంకట మురళీధర్ కి 95,837/- వెరశి పైన పేర్కొన్న ఎనిమిది మందికి గాను రూ.4,29,859/- విలువైన చెక్కులను మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి చేతుల మీదుగా అందించడం జరిగింది.
అవసరమైన సమయంలో వైద్యం నిమిత్తం సహాయం చేసినందుకు లబ్దిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి,ఆర్ధిక సహాయం మంజూరు నిమిత్తం సిఫారసు చేసిన ఎంపి బాలశౌరికి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







