మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- November 28, 2025
హైదరాబాద్: ప్రపంచ టెక్నాలజీ నాయకుడు సందీప్ కుమార్ మక్తాలా, ఇటీవల రాజభవన మద్దతుతో ప్రకటించిన యూఏఈ గోల్డెన్ వీసా ఘనతను అందుకుని ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు.ఆయన రాక సందర్భంగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అద్భుతమైన ఫ్లాష్‌మాబ్‌తో ఘన స్వాగతం లభించింది.అనంతరం ఆయన భార్య భాగ్యలక్ష్మి తో కలిసి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును మంత్రివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.
భారతదేశానికి తిరిగొచ్చిన వెంటనే, మొదటి విజిట్‌గా మంత్రిని కలవడం ద్వారా, తెలంగాణ ప్రభుత్వంపై తనకు ఉన్న కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసినట్లు మక్తాలా తెలిపారు.
తెలంగాణ గర్వసుతుడు అయిన సందీప్ మక్తాలా, తెలంగాణ ఉద్యమం సమయంలో సాంకేతిక సేవలు, వాలంటీర్ల సమన్వయం,యువతను చైతన్యపరిచే కార్యక్రమాలు వంటి కీలక భూమిక పోషించిన విషయం తెలిసిందే.రాష్ట్రాభివృద్ధిపై ఆయనకున్న అనుబంధం, బాధ్యత భావం, ఇప్పటికీ ప్రపంచ స్థాయి భాగస్వామ్యాలు,పెట్టుబడులు,ఇన్నోవేషన్ కార్యక్రమాల రూపంలో కొనసాగుతున్నాయి.
మంత్రిని కలిసిన సందర్భంలో, తెలంగాణ గ్లోబల్ కనెక్టివిటీ, పెట్టుబడుల రాక, స్టార్టప్ ఇకోసిస్టమ్ అభివృద్ధి, టెక్నాలజీ–పరిశ్రమల రంగాల పురోగతికి తన సంపూర్ణ సహకారం అందిస్తానని మక్తాలా హామీ ఇచ్చారు. యూఏఈ గౌరవం పొందడం తనకు మరింత బాధ్యతను గుర్తుచేసిందని, ఈ గుర్తింపును తెలంగాణ అభివృద్ధికి ఉపయోగిస్తానని తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ – “సందీప్ మక్తాలా ప్రపంచవ్యాప్త గుర్తింపు తెలంగాణకు గర్వకారణం.రాష్ట్రాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టడంలో ఆయన పాత్ర అనివార్యం” అని అభినందించారు. రాష్ట్ర ఆవిష్కరణల దిశగా, పరిశ్రమల వృద్ధిలో, అంతర్జాతీయ భాగస్వామ్యాలు పెంపొందించడంలో మక్తాలా గారి సహకారాన్ని ఆయన స్వాగతించారు.
63 దేశాలలోని 2,843 కంపెనీలకు ప్రతినిధిగా పనిచేస్తున్న డబ్ల్యూటీఐటీసీ చైర్మన్‌గా, యూఏఈ గౌరవం తనపై పెట్టిన విశ్వాసానికి ప్రతీకగా భావిస్తున్నానని, “తెలంగాణకు గ్లోబల్ బ్రిడ్జెస్‌ను నిర్మించడం నా బాధ్యత” అని సందీప్ మక్తాలా పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ ఘటన పై ఇజ్రాయెల్ తీవ్ర వ్యాఖ్యలు
- యూఏఈలో ఇన్వెస్ట్మెంట్ మోసాలపై కీలక హెచ్చరిక
- సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆర్టీసీ బస్ పాసులు..పరిశీలనలో ప్రభుత్వం!
- సైన్ బోర్డు పై హిందీ పదాలు..ఇద్దరు ఇంజనీర్లను సస్పెండ్ చేసిన తమిళనాడు ప్రభుత్వం!
- దేశ నిర్మాణంలో నిర్మల సీతారామన్ కీలక పాత్ర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
- భారతి మాతాజీ అస్తమయం
- సౌదీలో అక్టోబర్ 7న నేషనల్ గ్రీనింగ్ సీజన్ ప్రారంభం..!!
- ఖతార్లో పటిష్టంగా సమాచార భద్రతా నిబంధనల అమలు..!!
- ఒమన్ న్యాయ వ్యవస్థలో డిజిటల్ సేవల విస్తరణ..!!
- మక్కాలో వేధింపులు.. భయాందోళనకు గురిచేసిన వ్యక్తి అరెస్ట్..!!







