వైద్య ఆరోగ్య శాఖలో 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

- August 25, 2025 , by Maagulf
వైద్య ఆరోగ్య శాఖలో 1623 సర్కార్ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న 1623 వైద్యుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) పరిధిలోని ఆసుపత్రుల్లో 1616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (Civil Assistant Surgeon) పోస్టులు, అలాగే ఆర్టీసీ ఆసుపత్రుల్లో 7 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ
ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 8 (from Online applications September 8) నుండి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ఆగస్ట్ 22 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ విభాగాల పోస్టులకు దరఖాస్తు చేయాలనుకుంటే, ప్రతి పోస్టుకు వేర్వేరుగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

జోన్‌ల వారీగా నియామకాలు
ఈ నియామకాలు మల్టీజోన్ ప్రాతిపదికన జరుగుతాయి.

మల్టీజోన్ 1లో 858 పోస్టులు
మల్టీజోన్ 2లో 765 పోస్టులు భర్తీ చేయనున్నారు.
అభ్యర్థులు ఎంపికైన తర్వాత ప్రైవేటు ప్రాక్టీస్ నిర్వహించడానికి అనుమతి ఉండదని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.

విభాగాల వారీగా పోస్టుల సంఖ్య
గైనకాలజీ – 247
ఎనస్తీషియా – 226
పీడియాట్రిక్స్ – 219
జనరల్ సర్జరీ – 174
జనరల్ మెడిసిన్ – 166
పాథాలజీ – 94
ఆర్థోపెడిక్స్ – 89
రేడియాలజీ – 71
ఫోరెన్సిక్ మెడిసిన్ – 62
పల్మనరీ మెడిసిన్ – 58
సైకియాట్రి – 47
ఆప్తమాలజీ – 38
డెర్మటాలజీ – 31
హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ – 24
బయోకెమిస్ట్రీ – 8
మైక్రోబయాలజీ – 8
కాంట్రాక్ట్ వైద్యులకు అదనపు మార్కులు
ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు విధానంలో సేవలు అందిస్తున్న వారికి 20 పాయింట్లు అదనంగా ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థులు పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం వంటి సమాచారం కోసం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు వెబ్‌సైట్‌లో విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com