ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. సర్టిఫికెట్ల పరిశీలన వాయిదా.. కొత్త డేట్ ఇదే..
- August 25, 2025
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మెగా డీఎస్సీపై కీలక ప్రకటన చేసింది. తాజాగా, ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనను మంగళవారానికి వాయిదా వేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ముందు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25 సోమవారం నుంచే ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, కాల్ లెటర్ల పంపిణీలో ఆలస్యం జరగడంతో వెరిఫికేషన్ ప్రక్రియను(AP Mega DSC) ఒక రోజు వాయిదా వేశారు అధికారులు.
ఇక మెగా డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను ఇప్పటికే విడుదల చేశారు. అభ్యర్థులు పరీక్షల్లో సాధించిన స్కోర్ ఆధారంగా ర్యాంకులు కూడా కేటాయించారు. ఇక రిజర్వేషన్లు, స్థానికత ప్రమాణాల ఆధారంగా ఎంపికైన వారికి కాల్ లెటర్లు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి, ఎలాంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా పలు దఫాలుగా జాబితాలను పరిశీలిస్తున్నారు అధికారులు. తాజా అప్డేట్ ప్రకారం సోమవారం ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్లో కాల్ లెటర్లు అందుబాటులో ఉంటాయని అధికారుల నుంచి వస్తున్న సమాచారం.
ఇక సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ పూర్తయిన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ మొదటి వారంకల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కౌన్సెలింగ్ అనంతరం ఎంపికైన అభ్యర్థులను వచ్చే నెల రెండో వారంలోనే పాఠశాలల్లో జాయిన్ అయ్యేలా షెడ్యూల్ను సిద్ధం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో రోడ్డు ప్రమాదం..చిన్నారి సహా ముగ్గురు మృతి..!!
- చలి కుంపట్ల పై కువైట్ ఫైర్ ఫోర్స్ వార్నింగ్..!!
- గ్లోబల్ ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ సిటీగా దోహా..!!
- సౌదీయేతరుల కోసం 170 జోన్లు కేటాయింపు..!!
- దుబాయ్లో ట్రక్ డీజిల్ చోరీ..ఇద్దరు వ్యక్తులకు జైలుశిక్ష..!!
- ఒమన్ లో ఇండియన్ వెస్ట్రన్ నావల్ కమాండ్ కమాండర్..!!
- NRI టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో







