ఒమన్ ఎయిర్ 3-రోజుల సేల్‌ ప్రారంభం..!!

- August 26, 2025 , by Maagulf
ఒమన్ ఎయిర్ 3-రోజుల సేల్‌ ప్రారంభం..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ జాతీయ క్యారియర్ అయిన ఒమన్ ఎయిర్ 3-రోజుల ప్రత్యేకమైన సేల్‌ను ప్రకటించింది.  GCC అంతటా 29 OMR లతో ప్రయాణించే అవకాశాన్ని అందిస్తుంది. ఈ ఆఫర్ దుబాయ్, దోహా, బహ్రెయిన్, కువైట్, రియాద్, జెడ్డా తోపాటు లోకల్ నెట్‌వర్క్‌ను కవర్ చేస్తుందని తెలిపారు. టికెట్ ధరలోనే ఒమన్ ఎయిర్ సిగ్నేచర్ ఆతిథ్యాన్ని ఆస్వాదించవచ్చని ఒమన్ ఎయిర్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ మైక్ రట్టర్ తెలిపారు.

పరిమిత-సమయ ప్రమోషన్‌లో వన్-వే మరియు రిటర్న్ ఎకానమీ క్లాస్ ఛార్జీలు ఉన్నాయని, ఇది ఆగస్టు 26 నుండి 28 వరకు సేల్స్ అందుబాటులో ఉంటాయని, సెప్టెంబర్ 27 నుండి నవంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చిన పేర్కొన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com