GCC జాతీయులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలకు భత్యం..!!
- August 27, 2025
మానామా: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) దేశాల పౌరులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలకు జీవన వ్యయ భత్యాన్ని విస్తరించే ప్రతిపాదనను బహ్రెయిన్ ఎంపీ జలాల్ కజెం అల్-మహ్ఫౌద్ సమర్పించారు. అయితే, వారు బహ్రెయిన్‌లో శాశ్వతంగా నివసించాలని కండిషన్ విధించారు. ఈ మహిళలకు ఇతర బహ్రెయిన్ పౌరుల మాదిరిగానే మద్దతును అందించడం సామాజిక న్యాయాన్ని ప్రోత్సహించడం వంటిదని అని అన్నారు.
పెరుగుతున్న జీవన వ్యయాలు మరియు ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న అనేక బహ్రెయిన్ కుటుంబాలను గమనించిన తర్వాత ఈ ప్రతిపాదన చేసినట్లు అల్-మహ్ఫౌద్ వివరించారు. GCC జాతీయులను వివాహం చేసుకున్న బహ్రెయిన్ మహిళలు ఇతర పౌరుల మాదిరిగానే తమ మాతృభూమితో కలిసి ఉండేందుకు ఇది దోహదం చేస్తుందన్నారు. జీవన వ్యయ భత్యం కార్యక్రమంలో ఈ మహిళలను చేర్చడం సామాజిక రక్షణను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ మద్దతు కార్యక్రమాల నుండి పౌరులందరూ ప్రయోజనం పొందేలా చూసుకోవడానికి సానుకూల అడుగు అవుతుందని అల్-మహ్ఫౌద్ అన్నారు.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







