గాజాపై కొనసాగుతున్న దురాక్రమణను ఖండించిన ఒమన్..!!
- August 27, 2025
మస్కట్: ఖాన్ యూనిస్‌లోని నాజర్ మెడికల్ కాంప్లెక్స్‌లో వైద్య, సహాయ మరియు మీడియా సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుని గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న దాడులను ఒమన్ సుల్తానేట్ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ మానవతా చట్టాన్ని స్పష్టంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒమన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం, భద్రతా మండలి నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని ఒమన్ సుల్తానేట్ కోరింది.
పాలస్తీనా ప్రజలు వారి చట్టబద్ధమైన హక్కులను పొందడం ద్వారా మాత్రమే పాలస్తీనా ప్రజలకు న్యాయం జరుగుతుందని ఒమన్ స్పష్టం చేసింది. అంతర్జాతీయ చట్టబద్ధత మరియు అరబ్ శాంతి తీర్మానాల ఆధారంగా అల్ ఖుద్స్ అ'షర్కియా (తూర్పు జెరూసలేం) రాజధానిగా పాలస్తీనా రాజ్య స్థాపన అన్నింటికి పరిష్కారం చూపుతుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో లీక్స్ పై బీఆర్ఎస్ లీగల్ ఫైట్..!
- అకీరానందన్ పై AI వీడియో.. నిందితుడి అరెస్ట్
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!







