అల్ వాజ్బాలో ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్‌వర్క్ పనులు పూర్తి..!!
- August 27, 2025
దోహా: ఖతార్ లోని అల్ వాజ్బా తూర్పులో రోడ్లు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టు ప్యాకేజీ 3 పూర్తయినట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ‘అష్ఘల్’ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలోని రోడ్డు నెట్‌వర్క్ మరియు మౌలిక సదుపాయాల సేవలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుందని అష్ఘల్ ఇంజినీర్ హమద్ అల్ మెజాబా తెలిపారు. ఈ ప్రాజెక్టు సమీప ప్రాంతాల ప్రజల జీవన నాణ్యతను పెంచుతుందన్నారు.
అల్ వాజ్బా తూర్పును అభివృద్ధి చేయాలనే అధికార ప్రణాళికలో రెండు ప్యాకేజీలు ఉన్నాయని ఇంజనీర్ హమద్ అల్ మెజాబా తెలిపారు. అథారిటీ 2024 ప్రారంభంలో మొదటి ప్యాకేజీని పూర్తి చేసిందన్నారు. మొత్తం 17 కి.మీ.లతో కూడిన ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్‌వర్క్ ట్రాఫిక్ సమస్యలను తీర్చడంతోపాటు అనేక విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మరియు మసీదులు, అల్ వాజ్బా హెల్త్ సెంటర్ కు పబ్లిక్ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ ప్రాజెక్ట్‌లో 854 స్ట్రీట్ లైట్స్, 3,180 పార్కింగ్ స్థలాలతోపాటు 34 కి.మీ.ల వాకింగ్, సైక్లింగ్ ట్రాక్స్ ను ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్ పరిధిలో 12 కి.మీ మురుగునీటి నెట్‌వర్క్‌లు, 15.7 కి.మీ ఉపరితల, భూగర్భజల మరియు వర్షపు నీటి పారుదల నెట్‌వర్క్‌లు, 8.5 కి.మీ శుద్ధి చేసిన మురుగునీటి నెట్‌వర్క్ అభివృద్ధి ఉన్నాయని ఇంజినీర్ అల్ తమీమి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!