పిల్లలకోసం కొత్తగా రానున్న 'సూపర్ రైమ్స్'

- July 18, 2016 , by Maagulf
పిల్లలకోసం కొత్తగా రానున్న 'సూపర్ రైమ్స్'

చిన్నపిల్లల్లో మనోవికాసం, మానసిక స్థైర్యం పెంపొందించేలా 'సూపర్ రైమ్స్' చిత్రం తెరకెక్కుతోంది. రామ్‌రెడ్డి పన్నాల దర్శకత్వంలో ఎక్సెల్ ఫిల్మ్స్ సమర్పణలో వాజిద్ ఖాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్టర్, పాటలను అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ హైదరాబాద్‌లో విడుదల చేశారు. అనంతరం నిర్మాతలు మాట్లాడుతూ -''చిన్నపిల్లల కోసం సరికొత్త థీమ్‌తో డిజైన్ చేసిన చిత్రమిది. పదిహేను రోజుల్లో ఈ ట్రైలర్‌ను, సినిమాను విడుదల చేస్తాం'' అని చెప్పారు. ''చిన్న పిల్లల్ని చూసినప్పుడు ఎంత బాధ అయినా మరచిపోగలం. ఈ కారణంగానే చిన్నపిల్లలపై 'సూపర్ రైమ్స్' పేరుతో ఇండిపెండెంట్ చిత్రం చేశాం'' అని దర్శకుడు అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com