చుండ్రు సమస్యలకు చెక్!
- July 18, 2016
ఈ కాలంలో చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతుంది. తెల్లగా పొట్టు మాదిరి రాలిపోతుంటుంది. మరి ఈ సమస్యను వదిలేయకుండా.. ఇంట్లో దొరికే పదార్థాలతోనే పరిష్కరించుకోవచ్చు.
వెనిగర్: మూడు కప్పుల నీళ్లలో కప్పు వెనిగర్ కలిపాలి. తల మీద మెల్లగా మర్దన చేసుకుంటూ.. ఆ నీళ్లను పోసుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికోసారి చేయడం వల్ల చుండ్రు సమస్య త్వరగా తగ్గుతుంది.
ఆముదం: దీనిలో యాంటీఫంగల్ గుణాలు ఎక్కువ. ఆముదంతో మర్దన చేయడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి. రక్తప్రసరణా మెరుగవుతుంది. గంటయ్యాక తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తుంటే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.
పెరుగూ, తేనె: ఓ నిమ్మకాయ తీసుకుని దానిని కప్పు పెరుగులో పిండాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి జుట్టుకు పూతలా వేయాలి. గంటయ్యాక గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. దీనివల్ల యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అందడంతోపాటూ జుట్టు జిడ్డుగా మారకుండా ఉంటుంది. చుండ్రు సమస్య కూడా అదుపులోకి వస్తుంది.
వేప: ఈ ఆకుల్లో యాంటీ ఫంగల్ గుణాలు అధికం. బకెట్ నీళ్లలో నాలుగైదు గుప్పెళ్ల వేపాకు వేయాలి. తరవాత వడకట్టి తలస్నానానికి ఉపయోగించాలి. ఈ నీళ్లు చుండ్రును తొలగించి.. ఇతర సమస్యలనూ దూరంపెడతాయి.
నిమ్మరసం: ఒక నిమ్మ చెక్కతో మాడుకు మర్దన చేయాలి. ఇరవై నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. నిమ్మరసం పలు ఇన్ఫెక్షన్లు దూరం చేసి ఆ సమస్యను అదుపు చేస్తుంది. తలలో పుండ్లు, గాయాల వంటివి ఉన్నప్పుడు నిమ్మకాయ జోలికి వెళ్లకపోవడం మంచిది. ఇలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. చుండ్రు తగ్గకపోతే నిపుణులను సంప్రదించాలి.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







