సౌదీ అరేబియాలో ముగిసిన బర్గర్ చైన్ హాంబర్గి సేవలు..!!
- August 30, 2025
రియాద్: 12 సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత, సౌదీ అరేబియా లోని హాంబర్గిని బర్గర్ చైన్ కథ ముగిసింది. దాని మాతృ సంస్థ అయిన అససియత్ అల్-ఘితా ట్రేడింగ్‌ను రద్దు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వినియోగదారుల విశ్వాసాన్ని దెబ్బతీసి, కంపెనీని దివాలా తీయించిన ఒక పెద్ద ఫుడ్ పాయిజనింగ్ సంఘటన తర్వాత ఈ తీర్పు వెలువడింది.
దివాలా ట్రస్టీ ముబారక్ అల్-అనాజీ గత వారం రియాద్ కమర్షియల్ కోర్టు లిక్విడేషన్ చర్యలను ఆదేశించిందని మరియు తీర్పు వెలువడిన 90 రోజుల్లోపు క్లెయిమ్‌లను సమర్పించాలని రుణదాతలను కోరినట్లు ప్రకటించారు.
2013లో రియాద్‌లో స్థాపించబడిన హాంబర్గిని.. డిజిటల్ మార్కెటింగ్ మరియు బలమైన సోషల్ మీడియా ఉనికి ద్వారా యువ వినియోగదారులలో గుర్తింపు పొందింది. 2015 మరియు 2019 మధ్య సౌదీ అరేబియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ప్రముఖ బర్గర్ బ్రాండ్లలో ఒకటిగా గుర్తింపు సాధించింది. హాంబర్గిని సౌదీ అరేబియా అంతటా 57 శాఖలను నిర్వహించింది.
రియాద్‌లో 2024లో జరిగిన ఫుడ్ పాయిజన్ సంఘటనలో 70 మందికి పైగా అనారోగ్యానికి గురయ్యారు. ఒకరు మరణించారు. క్లోస్ట్రిడియం బోటులినమ్తో కలుషితమైన దిగుమతి చేసుకున్న "బాన్ తుమ్" మయోసాస్ బ్రాండ్ ఫుడ్ పాయిజన్ కు కారణమని దర్యాప్తులో తేలింది. దీంతో అధికారులు రియాద్‌లోని అన్ని హాంబర్గిని బ్రాంచీలను సీజ్ చేశారు. ఉత్పత్తిని నిలిపివేయించడంతో అది ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.
తాజా వార్తలు
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!
- ఓవర్‌టేకింగ్, లేన్ స్కిప్పింగ్.. డ్రోన్లతో ట్రాఫిక్ పర్యవేక్షణ..!!
- అలెర్ట్: ఫుజైరాలో భారీ వర్షాలు..వాటర్ ఫాల్స్ కనువిందు..!!
- ప్రైవేట్ స్కూళ్లలో సంస్కరణలకు బహ్రెయిన్ శ్రీకారం..!!
- షురా కౌన్సిల్ ను సందర్శించిన భారత ప్రతినిధి బృందం..!!
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్