ఖతార్ లో ముగిసిన వేసవి సెలవులు..!!

- August 31, 2025 , by Maagulf
ఖతార్ లో ముగిసిన వేసవి సెలవులు..!!

దోహా: ఖతార్ లో వేసవి సేలవుల ముగిసాయి. పాఠశాలలు పునర్ ప్రారంభమయ్యాయి. 2025–2026 కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంతో స్కూల్స్ లలో విద్యార్థుల సందడి నెలకొన్నది. స్కూల్స్ పునర్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఖతార్ విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) వెల్లడించింది.  ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంత్రిత్వ శాఖ తన అభినందనలు తెలియజేసింది.   

ఇక ఈ అకాడమిక్ ఇయర్ లో మంత్రిత్వ శాఖ 10 కొత్త ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభించింది. ఇవి 6,000 అదనపు సీట్లు సమకూరాయి. వీరి కోసం 1,124 కొత్త ఉపాధ్యాయులను నియమించారు. రాబోయే రోజుల్లో 11 కొత్త పాఠశాలలను నిర్మించనున్నట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. 

276 పాఠశాలలు మరియు కిండర్ గార్టెన్‌లలో స్టూడెంట్స్ ఆరోగ్య మరియు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా గదులు, ఎయిర్ కండిషనింగ్ సేవలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.  విద్యార్థులను పాఠ్యపుస్తకాలు, ఇతర స్టేషనరీని పంపిణీ చేశారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com