స్కూల్ గార్డులకు ట్రాఫిక్ భద్రతా పాఠాలు..!!
- August 31, 2025
మనామా: ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలల కమ్యూనిటీ పోలీసు సిబ్బంది, స్కూల్ గార్డులకు ట్రాఫిక్ భద్రతాపై అవగాహన కల్పించారు. ఇందుకు సంబంధించిన శిక్షణ మరియు రిఫ్రెషర్ కోర్సులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ విభాగం నిర్వహించిందని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
పాఠశాల పరిసరాలను సురక్షితంగా ఉంచడం, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, పాఠశాల గేట్ల ముందు ట్రాఫిక్‌ను ఎలా నిర్వహించాలో పాల్గొన్నవారికి అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్లను సురక్షితంగా దాటడంలో సహాయపడటానికి మరియు ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా వాహనాల పార్కింగ్‌ను నిర్వహించడానికి శిక్షణ ఇచ్చారు.
కమ్యూనిటీ పోలీసులు మరియు పాఠశాల గార్డులతో సహకరించాలని, వారి మార్గదర్శకత్వాన్ని పాటించాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని డైరెక్టరేట్ పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్