సెప్టెంబర్ 1 నుండి ఏమేం మారుతాయంటే!

- August 31, 2025 , by Maagulf
సెప్టెంబర్ 1 నుండి ఏమేం మారుతాయంటే!

న్యూ ఢిల్లీ: సెప్టెంబర్ నెలలో దేశ ఆర్థిక వ్యవస్థలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి.సెప్టెంబర్ 3, 4 తేదీల్లో జరగనున్న 56వ జీఎస్టీ సమావేశంలో ప్రస్తుతమున్న నాలుగు పన్ను శ్లాబులకు బదులుగా కేవలం 5% మరియు 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే ప్రజలపై పన్ను భారం తగ్గే అవకాశం ఉంది. అలాగే, రేపటి నుంచి, అంటే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది వెండి కొనుగోలుదారులకు నాణ్యత హామీనిస్తుంది.

డిజిటల్ చెల్లింపుల విషయంలో కూడా కొన్ని మార్పులు రానున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొన్ని క్రెడిట్ కార్డులపై డిజిటల్ గేమింగ్, ప్రభుత్వ పోర్టల్స్ ద్వారా చేసే చెల్లింపులకు రివార్డు పాయింట్లు ఇవ్వకపోవచ్చు. ఈ మార్పు కార్డు వినియోగదారులపై ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా, జనధన్ ఖాతాలు ఉన్నవారు సెప్టెంబర్ 30 లోపు తమ ఖాతాలకు KYC (నో యువర్ కస్టమర్) ప్రక్రియను పూర్తి చేయాలి. లేకపోతే వారి ఖాతాలు స్తంభించిపోవచ్చు.

పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గడువు తేదీ సెప్టెంబర్ 15. 2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఐటీఆర్ (ఆదాయపు పన్ను రిటర్న్) ఫైలింగ్ చేయడానికి ఇదే చివరి తేదీ. ఈ గడువులోగా ఐటీఆర్ ఫైల్ చేయనివారు జరిమానాలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఈ తేదీని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ అన్ని మార్పులు సాధారణ పౌరుల ఆర్థిక కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com