600 ప్రాణాలు బలిగొన్న అఫ్గాన్ భూకంపం..
- September 01, 2025
అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. యూఎస్ జియోలాజికల్ సర్వే సమాచారం ప్రకారం, ఈ భూకంపం జలాలాబాద్ సమీపంలోని నంగర్హార్ ప్రావిన్స్‌లో కేంద్రీకృతమైంది. భూకంపం 8 కిలోమీటర్ల లోతులో, రాత్రి 11.47 గంటలకు సంభవించింది.
కునార్ ప్రావిన్స్ ఎక్కువగా ప్రభావితమైంది. భూకంపం తీవ్రతకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలు గ్రామాల్లో ఇళ్లు నేలమట్టమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మాజీ మేయర్ జరీఫా ఘఫ్ఫారీ మాట్లాడుతూ, “కునార్, నోరిస్థాన్, నంగర్హార్ ప్రావిన్స్‌లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇళ్లు కూలిపోవడంతో చాలా కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. బాధితులకు ఆహారం, ఆశ్రయం అవసరం. తాలిబన్ ప్రభుత్వం సరిగా స్పందించలేకపోతోంది. అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలి” అని అన్నారు.
క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా బాధితుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ భూకంపం తర్వాత 20 నిమిషాలకే 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్‌లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







