పెట్రోల్ స్టేషన్లలో యూఏఈ లాటరీ టక్కెట్లు..!!
- September 01, 2025
యూఏఈ: గత 10 నెలల్లో యూఏఈ లాటరీ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. ఆన్లైన్లో ఈ గేమ్ కు 600,000 మందికిపైగా తమ పేర్లను నమోదుచేసుకున్నారు. దుబాయ్ లో మూడు ప్రదేశాలలోని ADNOC పెట్రోల్ స్టేషన్లలో కంపెనీ తన టిక్కెట్ల అమ్మకాన్ని ప్రారంభించిందని ది గేమ్‌లోని లాటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ బిషప్ వూస్లీ అన్నారు. ఈ గేమ్‌తో వేలాది మంది ధనవంతులుగా మరారాని తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 247,119 మందికి పైగా విజేతలు అయ్యారని పేర్కొన్నారు.
కాగా, గత నెలలో యూఏఈ లాటరీ నాలుగు కొత్త స్క్రాచ్ కార్డులను ప్రారంభించింది. దీని వలన నివాసితులకు Dh5 నుండి Dh50 వరకు టిక్కెట్లతో Dh 1 మిలియన్ వరకు గెలుచుకునే అవకాశం లభించింది. యూఏఈ లాటరీ రిటైల్ ఎక్స్‌ప్రెస్‌లో పాల్గొనేందుకు కచ్చితంగా 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలని, అలాంటి వారినే అనుమతిస్తామని ఒక ఉన్నత అధికారి చెప్పారు.
తాజా వార్తలు
- ఆసియా-పసిఫిక్‌లో ఏరో ఇంజిన్ సేవల విస్తరణకు జీఎంఆర్ ఏరో టెక్నిక్–స్టాండర్డ్ ఏరో భాగస్వామ్యం
- యూపీఐ ఛార్జీలపై NPCI కీలక ప్రకటన
- దుబాయ్‌లో పెయిడ్ కార్ లిఫ్ట్‌లపై ఆర్టీఏ హెచ్చరిక.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- దుబాయ్‌లో ఇళ్ల కొనుగోలుపై UBS ఆసక్తికర నివేదిక..!!
- కువైట్‌లో అత్యవసర ప్రణాళికలపై ఫైర్‌ఫోర్స్ సమీక్ష..!!
- ఖతార్‌లో డ్రైవింగ్ లైసెన్స్: అర్హతలు, నిబంధనలు, ఫీజుల పూర్తి వివరాలు..!!
- ప్రపంచ ముస్లింల మనోభావాలను హౌతీ దెబ్బతీస్తోంది..!!
- హోర్ముజ్ జలసంధి పునరుద్ధరణ..ఫ్రాన్స్‌తో జీసీసీ కీలక చర్చలు..!!
- మస్కట్‌లో రోడ్ల అభివృద్ధికి భారీగా పనులు..భద్రత బలోపేతం..!!
- ఇరాన్ పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక.. ఒప్పందం కుదరకపోతే ‘అంతం చేస్తా’







