ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!

- September 01, 2025 , by Maagulf
ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ చోరీ ముఠాకు పోలీసులు చెక్..!!

కువైట్: కువైట్ లో నేరాలను ఎదుర్కోవడానికి అంతర్గత మంత్రిత్వ శాఖ విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, క్యాపిటల్ గవర్నరేట్ ఇన్వెస్టిగేషన్స్ డిపార్ట్‌మెంట్, జాబర్ అల్-అహ్మద్ ఇన్వెస్టిగేషన్స్ ఆఫీస్ విభాగాల అధికారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్లు మరియు ప్రభుత్వ కేబుల్‌లను చోరీ చేస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేసింది.

ఈ ముఠాలో 13 మంది వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఐదుగురు బంగ్లాదేశీయులు మరియు ఏడుగురు ఈజిప్షియన్లు ఉన్నారు. గత సోమవారం జలీబ్ అల్-షుయౌఖ్ ప్రాంతంలో చోరీ కేబుల్‌లను తరలిస్తూ..ముఠా సభ్యుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు.అనంతరం వారిచ్చిన సమాచారంతో ముఠా సభ్యులను అరెస్టు చేశారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com