అలయ్ బలయ్ వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానించిన దత్తాత్రేయ

- September 01, 2025 , by Maagulf
అలయ్ బలయ్ వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానించిన దత్తాత్రేయ

న్యూ ఢిల్లీ: హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ నేడు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌ను సందర్శించి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ను మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఆమెను ప్రత్యేకంగా హైదరాబాద్‌లో జరగనున్న ప్రముఖ సాంస్కృతిక కార్యక్రమానికి ఆహ్వానించారు.

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 3న హైదరాబాద్‌లో నిర్వహించనున్న “అలయ్ బలయ్” కార్యక్రమానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరుకావాలని దత్తాత్రేయ కోరారు. ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమం ఉద్దేశాలు, ప్రాధాన్యతపై వివరమైన సమాచారం అందించారు.

అలయ్ బలయ్ పండుగ ప్రకృతి విలువల్ని ప్రతిబింబించేదిగా, విభిన్న ప్రజల మధ్య స్నేహాన్ని, ఐక్యతను పటిష్టం చేసే వేదికగా నిలుస్తుందని దత్తాత్రేయ వివరించారు. ఈ కార్యక్రమం వివిధ రంగాల ప్రముఖులను ఒకచోట చేర్చి మతసామరస్యాన్ని, సాంస్కృతిక ఐక్యతను చాటేదిగా ఉంటుంది.

బండారు దత్తాత్రేయ వివరాలను సంతోషంగా విన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, అలయ్ బలయ్ వంటి పౌర సంబంధాల కార్యక్రమాలు సామాజిక విలువలను పెంపొందించేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. అనేక సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం ప్రశంసనీయం అని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com