అప్ఘానిస్థాన్ భూకంపం: 1400 మందికి పైగా దుర్మరణం..
- September 02, 2025
అప్ఘానిస్థాన్ లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. పెను విషాదాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 6.0 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది. భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1400 మందికి పైగా చనిపోయారు. 3వేల మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Telugu » International » Afghanistan Earthquake Death Toll Crosses 1400 Search For Survivors Continues Nk
Afghanistan Earthquake: 1400 మందికిపైగా దుర్మరణం.. ఊళ్లకు ఊళ్లే మాయం.. అప్ఘానిస్థాన్లో భూకంపం విధ్వంసం..
ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Published By: 10TV Digital Team ,Published On : September 2, 2025 / 07:17 PM IST
Facebook
twitter
linkedin
whatsapp
telegram
google-news
daily-hunt
Afghanistan Earthquake: 1400 మందికిపైగా దుర్మరణం.. ఊళ్లకు ఊళ్లే మాయం.. అప్ఘానిస్థాన్లో భూకంపం విధ్వంసం..
Updated On : September 2, 2025 / 7:17 PM IST
Afghanistan Earthquake: అప్ఘానిస్థాన్ లో భూకంపం భారీ విధ్వంసం సృష్టించింది. పెను విషాదాన్ని నింపింది. పెద్ద సంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఆదివారం రాత్రి 6.0 తీవ్రతతో వచ్చిన శక్తివంతమైన భూకంపం కునార్, నంగర్హార్ ప్రావిన్స్లను కుదిపేసింది. భూకంప విధ్వంసానికి ఊళ్లకు ఊళ్లే మాయమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకు భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు 1400 మందికి పైగా చనిపోయారు. 3వేల మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విపత్తులో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. భూకంపం వల్ల పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో రహదారులు మూసుకుపోయి సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు వాపోయారు.
భూకంపం సంభవించిన ప్రాంతంలో పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అక్కడి దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకుపోయారు. వారిని కాపాడుకునేందుకు బంధువులు చేస్తున్న ప్రయత్నాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వారు తమ చేతులతోనే మట్టిని తవ్వి తీస్తున్నారు. వేల సంఖ్యలో ప్రజలు ఇంకా శిథిలాల కిందే ఉండొచ్చని తెలుస్తోంది.
రాత్రి వేళ ప్రజలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో భారీ భూకంపం సంభవించింది. ఇళ్ల పైకప్పులు కూలి చాలామంది సజీవ సమాధి అయ్యారు. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







