సచిన్‌కు సుప్రీంలో ఊరట
- July 19, 2016
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ప్రదానం చేసిన దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వెనక్కి తీసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. భారతరత్న పురస్కారాన్ని దుర్వినియోగం చేశారనే అరోపణలతో వీకే నస్వా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు.
సచిన్‌ను భారతరత్నగా కీర్తిస్తూ కొందరు రచయితలు పుస్తకాలు రాశారని, సచిన్ కూడా అలాంటి వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకున్నారని నస్వా ఆరోపించారు. ఈ క్రమంలో భారతరత్నను వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఈ విషయంలో చర్యలు తీసుకోవడానికి చట్టబద్ధ నియమాలు లేవని పేర్కొంది.
'కొందరు ఇతర వ్యక్తులు మాజీ క్రికెటర్ సచిన్‌పై పుస్తకం రాసి భారతరత్న అని పేరు పెట్టుకున్నారు. అయితే దీనికి సచిన్‌ను బాధ్యులను చేయడం సబబు కాదు' అని న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







