'మిరాయ్' నుంచి అంబికగా శ్రియ శరణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్

- September 03, 2025 , by Maagulf
\'మిరాయ్\' నుంచి అంబికగా శ్రియ శరణ్‌ స్పెషల్ పోస్టర్ రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ 'మిరాయ్‌'లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ బజ్‌ను క్రియేట్ చేశాయి.  

ఈ చిత్రంలో శ్రియ శరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మేకర్స్ తాజాగా శ్రియను అంబికగా పరిచయం చేస్తూ ఒక ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేశారు.

శ్రియ శరణ్ పవర్ ఫుల్ మదర్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ అడ్వెంచర్‌ ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ ఎమోషన్ తో వుండబోతుంది. ఈ  పోస్టర్ సూపర్ హీరో ప్రయాణం వెనుక ఉన్న ఎమోషన్ ని హైలైట్ చేస్తుంది.

ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా, జయరామ్, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ దర్శకత్వం వహించడమే కాకుండా, సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే స్క్రీన్‌ప్లేను కార్తీక్ స్వయంగా రూపొందించారు. మణిబాబు కరణం రచన, సంభాషణలకు కీలకంగా పని చేశారు. గౌర హరి సంగీతం, ఆర్ట్ డైరెక్టర్‌గా శ్రీ నాగేంద్ర తంగాల, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా సుజిత్ కుమార్ కొల్లి పని చేస్తున్నారు.

మిరాయ్ సెప్టెంబర్ 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం:  కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రైటర్: మణిబాబు కరణం
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com