ఖతార్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఏర్పాటు..!!
- September 04, 2025
దోహా: ఉప ప్రధాన మంత్రి మరియు రక్షణ వ్యవహారాల సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ బిన్ అలీ అల్-థానీ అమిరి దివాన్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించారు.ఖతార్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అథారిటీకి సంబంధించి 2012 నాటి చట్టం నంబర్ 8లోని కొన్ని నిబంధనలను సవరించే ముసాయిదా చట్టాన్ని సమీక్షించి, దానిని శాసనసభ సమీక్షకు సూచించాలని నిర్ణయించారు.
కమ్యూనికేషన్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సామర్థ్యాలను పెంచడం కోసం నిర్దేశించిన ఒక ముసాయిదా క్యాబినెట్ తీర్మానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఈ సవరణ మంత్రిత్వ శాఖలో కృత్రిమ మేధస్సు కోసం జాతీయ కేంద్రాన్ని స్థాపించడం, నిర్వహించడం ఉన్నాయి.
ఖతారీ కమ్యూనిటీ విలువలను పరిరక్షించడానికి ఉద్దేశించిన రక్షణ, విద్య, నివారణ, సాధికారత మరియు ఇతర పద్ధతులకు సంబంధించి సాధించిన ఫలితాలను క్యాబినెట్ సమీక్షిందని న్యాయ మంత్రి ఇబ్రహీం బిన్ అలీ అల్ మొహన్నది వివరించారు. ఫ్రెంచ్ రిపబ్లిక్ మరియు GCC దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య భాగస్వామ్యాలను బలోపేతం చేయడానికి థర్డ్ విజన్ గోల్ఫ్ ఫోరమ్ ఫలితాలను కూడా క్యాబినెట్ సమీక్షిందని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







