ట్రాఫిక్ పర్యవేక్షణకు హెలికాప్టర్లు, అధునాతన కెమెరాలు..!!
- September 04, 2025
కువైట్: కువైట్ లో2025-2026 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది. స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు 300 ట్రాఫిక్, రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించనున్నట్టు పబ్లిక్ సెక్యూరిటీ అఫైర్స్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ అల్-దవాస్ తెలిపారు. వీటితోపాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు.
ఉదయం 6:00 నుండి 8:30 వరకు మరియు మధ్యాహ్నం 12:00 నుండి 2:30 వరకు రెండు షిఫ్టులలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు. ముఖ్యంగా సబా అల్-సేలం, హవల్లీ, జాబ్రియా, ఫర్వానియా, అల్-రక్కా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







