దుబాయ్ ఎయిర్ పోర్టులో కొత్త చెకింగ్ టెక్నాలజీ..!!
- September 04, 2025
యూఏఈ: దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DXB)లో ప్రయాణికులు ఇక తమ ల్యాప్ టాప్ లు బ్యాగు నుంచి తీయాల్సి పనిలేదు. వాటర్ బాటిల్స్ పడేయాల్సిన అవసరం ఉండదు. ఇవేవి లేకుండానే ఎంచక్కా సెక్యూరిటీ చెకింగ్ ను పూర్తి చేయవచ్చు.
ఇప్పటికే ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థలను దశలవారీగా తొలగిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ షంసి తెలిపారు. దీని స్థానంలో కొత్త బ్యాగేజీ చెకింగ్ టెక్నాలజీ 2026 చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుండి ఏమీ తీయవలసిన అవసరం లేకుండానే సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు.
ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణీకులు ల్యాప్టాప్లు, పెర్ఫ్యూమ్లు, క్రీమ్లు మరియు 100ml కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులను స్కానింగ్ చేసే కొత్త ఏఐ స్కానర్లను పరీక్షిస్తున్నట్లు తెలిపారు. 2025 మొదటి 6 నెలల్లో ఎయిర్ పోర్టు 46 మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించిందని, ఏటా ప్రయాణికుల సంఖ్య 2.3 శాతం పెరుగుతుందని అల్ షంసి వివరించారు.
తాజా వార్తలు
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!







