అభివృద్ధికి చేతులు కలిపిన బహ్రెయిన్ , ఈజిప్ట్..!!
- September 04, 2025
మనామా: బహ్రెయిన్, ఈజిప్ట్ మధ్య చారిత్రక, విశిష్ట సంబంధాలు ఉన్నాయని బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా అన్నారు. ఈజిప్టులో అధికారికంగా పర్యటిస్తున్న క్రౌన్ ప్రిన్స్.. ఈజిప్టు ప్రధాన మంత్రి డాక్టర్ మోస్తఫా మద్బౌలీతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. రెండు దేశాల అభివృద్ధికి దోహదం చేసే కొత్త అవకాశాల గురించి చర్చించారు. రెండు దేశాల సంబంధాలను మరిన్ని రంగాలను విస్తరించడానికి కలిసి పనిచేయడం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
చర్చల సందర్భంగా డిజిటల్ ట్రాన్స్ పర్ మేషన్, ఫినాన్స్ మరియు బ్యాంకింగ్, లాజిస్టిక్స్, పరిశ్రమలు, పర్యాటకం, నిర్మాణ రంగం, ఆహార భద్రతతో సహా కీలక రంగాలలో సహకారాన్ని పెంపొందించే మార్గాలను సమీక్షించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లోకీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







