ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
- September 04, 2025
అమరావతి: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్- ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద రాష్ట్రంలో పౌరులందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ పాలసీ అమలయ్యేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా రాష్ట్రంలోని 1.63 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించనుంది. 2వేల 493 నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు పొందేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనుంది.
మొత్తం 3వేల 257 చికిత్సలను హైబ్రిడ్ విధానంలో ఉచితంగా అందించనుంది ప్రభుత్వం. కేవలం 6 గంటల్లోనే వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చేలా ప్రీ ఆథరైజేషన్ మేనేజ్ మెంట్ తీసుకురానుంది. రూ.2.5 లక్షల లోపు వైద్య చికిత్సల క్లెయిమ్స్ ఇన్సూరెన్స్ కంపెనీల పరిధిలోకి వచ్చేలా కొత్త విధానం
తీసుకురానుంది. రూ..2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకకు వ్యయాన్ని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించనుంది.
1.43 కోట్ల మంది పేద కుటుంబాలకు ప్రయోజనం కలిగేలా..
1.43 కోట్ల మంది పేద కుటుంబాలు, 20 లక్షల మంది ఇతర కుటుంబాలకు వర్తించేలా ఎన్టీఆర్ వైద్య సేవ హైబ్రిడ్ విధానం అమలు చేయనుంది. కొత్త వైద్య కళాశాలల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది క్యాబినెట్. పీపీపీ విధానంలో రాష్ట్రంలో 10 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు ఆమోదాన్ని తెలిపింది.
రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలో పీపీపీ పద్దతిలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆర్ఎఫ్‌పీ జారీ చేసేందుకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర మంత్రివర్గం. రెండో దశలో మిగిలిన ఆరు ప్రాంతాల్లోని వైద్య కళాశాలలను పీపీపీ కింద ఏర్పాటు చేసేందుకు ఫీజిబిలిటీ రిపోర్ట్ సిద్ధం చేయాలని నిర్ణయించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!







