లక్కీ ఇండియన్స్.. చేజిక్కిన Dh15 మిలియన్ల జాక్ పాట్..!!
- September 05, 2025
యూఏఈ: బిగ్ టికెట్ అబుదాబి తన ఆగస్టు జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. సెప్టెంబర్ 3న జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసి Dh15 మిలియన్లు గెలుచుకున్నాడు. దుబాయ్‌లో నివసించే 30 ఏళ్ల టెక్నీషియన్ సందీప్ కుమార్ ప్రసాద్.. ఆగస్టు 19న 200669 నంబర్ టికెట్ ను కొనుగోలు చేసి, విజేతగా నిలిచాడు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైడాక్ కార్మికుడు సందీప్ మూడు సంవత్సరాలుగా యూఏఈలో నివసిస్తున్నాడు. తాను గెలిచానని తెలుసుకున్నప్పుడు, అతను భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఇప్పుడు అతను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, తన కుటుంబంతో కలిసి నిలబడటానికి భారతదేశానికి తిరిగి రావాలని కలలు కంటున్నాడు.
తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని, ఇది తనను తీవ్రంగా బాధితుందన్నారు. ఈ ప్రైజ్ మనీతో తన వారిని ఆదుకోవడానికి మరియు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 20 మంది స్నేహితులతో కలిసి టిక్కెట్ కొనుగోలు చేస్తూ.. గత మూడు నెలలుగా డ్రాలో పాల్గొంటున్నట్లు తెలిపాడు.
గ్రాండ్ ప్రైజ్‌తో పాటు, సెప్టెంబర్ 3 డ్రాలో ఆరుగురు ఒక్కొక్కరు దిర్హం 100,000 గెలుచుకున్నారు. విజేతలలో దుబాయ్‌లో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన రంజిత్ నాయర్, ఇండయన్ రంజిత్ నాయర్, జోర్డాన్‌కు చెందిన నిఖిల్ రాజ్ మరియు బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ రషీద్ ఉన్నారు.
బిగ్ విన్ (స్పిన్ ది వీల్) ద్వారా Dh140,000 లను జోగేంద్ర జాంగీర్ గెలుచుకున్నాడు. బహుమతి మొత్తంతో తన గృహ రుణాన్ని చెల్లించడానికి మరియు ఛారిటీకి విరాళంగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ముంబైకి చెందిన జిజు జాకబ్ Dh130,000 గెలుచుకున్నాడు. కేరళకు చెందిన శారద్ Dh130,000 గెలిచాడు. ఇక Dh100,000 గెలుచుకున్న సత్తార్ మజీహా తన కుటుంబాన్ని అమెరికాకు ట్రిప్‌కు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. అబుదాబిలో నివసిస్తున్న మరో భారతీయ ప్రవాసుడు షమీమ్ మూలతిల్ హంజా మూలతిల్ BMW M440i ను గెలుచుకున్నాడు.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







