మిరాయ్ ట్రైలర్ చూసి రజినీకాంత్ మెచ్చుకున్నారు
- September 05, 2025
కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మంచు మనోజ్ మళ్లీ సినిమాల పట్ల దృష్టి పెట్టి వరుస ప్రాజెక్టులతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవలి కాలంలో భైరవంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆయన, ఇప్పుడు భారీ అంచనాల మధ్య రూపొందిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్లో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. తేజా సజ్జా హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రంలో తేజా సజ్జాతో పాటు రితికా నాయక్ హీరోయిన్‌గా నటించగా, శ్రియా చరణ్, జగపతిబాబు, జయరామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే మంచు మనోజ్ ఇందులో ఓ విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ మాట్లాడుతూ.. ఈ పాత్రను ఆధునిక రావణాసురుడి వలె డిజైన్ చేశారని ఆయన స్వయంగా చెబుతున్నారు. అయితే ఇందులో ఆడవాళ్ల జోలికి వెళ్లే రావణాసురుడి ఇమేజ్‌ను చూపించకుండా, సీత రాకముందు ఆయన ఎలా ఉండేవాడో అలాంటి గంభీరమైన రూపాన్ని ఆవిష్కరించారని స్పష్టం చేశారు.
శక్తి ఉన్నవాడికే స్థానం దక్కాలి, కష్టపడే వాడికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదు అనే స్ట్రాంగ్ పాయింట్‌తో మూవీ సాగుతుంది. ఈ పాత్ర చేయడానికి వెళ్లే ముందు దేవుడికి దండం పెట్టి ఆంజనేయుడికి క్షమాపణ చెప్పాను. ఈ ట్రైలర్ చూసి రజినీకాంత్ మెచ్చుకున్నారు. ఇలాగే మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్లు అని ఆశీర్వదించారు. ఇకనుంచి గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేయాలని సూచించారు. నేను గతంలో సినిమాలు చేయనప్పుడే రజినీ అంకుల్ నాకు గట్టిగా క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావని నాపై అరిచారు.’ అని చెప్పుకొచ్చారు మంచు మనోజ్.
ఈ సినిమాలో తేజ చేతిలోని ‘మిరాయ్’ అస్త్రానికి ఓ చరిత్ర ఉన్నట్లే.. నా ఖడ్గానికీ ఓ ప్రత్యేకత ఉంటుంది. అది మాయమైపోయి మళ్లీ వస్తుంటుంది. దానికి ఆ లక్షణం ఉండటానికి కారణం ఏంటన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని తెలిపారు మనోజ్. ప్రస్తుతం నేను ‘డేవిడ్ రెడ్డి’, ‘రక్షక్’ అనే చిత్రాల్లో నటిస్తున్నాను. అలాగే ‘అత్తరు సాయిబు’ అనే ఓ కథ అనుకున్నాం.. త్వరలోనే దానిపై అప్‌డేట్ వస్తుంది.
తాజా వార్తలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!







