ఆంధ్రా కింగ్ తాలూకా సెకండ్ సింగిల్- పప్పీ షేమ్ సెప్టెంబర్ 8న రిలీజ్
- September 05, 2025
ఉస్తాద్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్, యూనిక్ ఎంటర్‌టైనర్ ఆంధ్రా కింగ్ తాలూక. మహేష్ బాబు పి దర్శకత్వంలో, ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. అద్భుతమైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. రామ్ పోతినేని స్వయంగా రాసిన, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ పాడిన ఫస్ట్ సింగిల్ వైరల్ అయ్యింది. ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉంది.
ఇప్పుడు, సెకెండ్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. వివేక్ & మెర్విన్ సంగీతం అందించిన ఫన్నీ నంబర్ పప్పీ షేమ్ ఆగస్టు 8న విడుదల కానుంది. పోస్టర్‌లో రామ్ ఎనర్జిటిక్ గా కనిపించారు. భారీగా జనం వున్న థియేటర్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షో జరుపుకుంటున్నట్లు ప్రజెంట్ చేయడం ఆసక్తికరంగా వుంది.
ఆంధ్రా కింగ్ తాలూకా లో రామ్ డై-హార్డ్ సినిమా ఫ్యాన్ గా అలరించబోతున్నారు, ఇది ఒక అభిమాని బియోపిక్ గా ఉండబోతోంది. రామ్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించగా, ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్ కూడా కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం: రామ్ పోతినేని, ఉపేంద్ర, భాగ్యశ్రీ బోర్సే, రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, VTV గణేష్
సాంకేతిక సిబ్బంది:
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: మహేష్ బాబు పి
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై. రవిశంకర్
ప్రొడక్షన్ హౌస్: మైత్రీ మూవీ మేకర్స్
సమర్పకులు: గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ & T-సిరీస్ ఫిలిమ్స్
CEO: చెర్రీ
సంగీతం: వివేక్ & మెర్విన్
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ నుని
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి తుమ్మల
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!