దుబాయ్ బ్లూ లైన్ మెట్రో వర్క్.. ట్రాఫిక్ డైవర్షన్స్..!!
- September 06, 2025
యూఏఈ: దుబాయ్ మెట్రో బ్లూ లైన్ నిర్మాణ పనుల కారణంగా సెంటర్ పాయింట్ స్టేషన్ సమీపంలో ట్రాఫిక్ డైవర్షన్స్ ప్రకటించారు. ఈ మేరకు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ వాహనదారులను అప్రమత్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. 2029 సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఈ కొత్త దుబాయ్ మెట్రో నెట్వర్క్.. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకునేలా రోడ్ నెట్ వర్క్ ను డెవలప్ చేస్తుందని అందులో పేర్కొంది. ఈ నెట్ వర్క్ సమీపంలో ట్రాఫిక్ రద్దీని 20 శాతం వరకు తగ్గిస్తుందని తెలిపింది.
ఎయిర్పోర్ట్ రోడ్ నుండి సెంటర్ పాయింట్ స్టేషన్లోని మల్టీ ఫ్లోర్ కార్ పార్కింగ్కు రోడ్డు మూసివేయనున్నట్లు, స్టేషన్కు చేరుకోవడానికి అక్కడ ఏర్పాటు చేసిన సైన్బోర్డులను ఫాలో కావాలని సూచించింది.
బ్లూ లైన్ ప్రాజెక్ట్ 30 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇందులోని 14 స్టేషన్ల నెట్వర్క్ లో 28 రైళ్లు పరుగులు తీయనున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ప్రస్తుత రైల్వే నెట్వర్క్ ను 78 స్టేషన్లు, 131 కి.మీ.లకు విస్తరించనుంది.
తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







