బహ్రెయిన్, సౌదీ అరేబియా ప్రయాణీకులకు గుడ్ న్యూస్..!!
- September 06, 2025
మనామా: బహ్రెయిన్ -సౌదీ అరేబియా మధ్య ప్రయాణం మరింత సులభం కానుంది. త్వరలోనే రెండు దేశాల మధ్య సముద్ర మార్గం అందుబాటులోకి రానుంది. సముద్ర మార్గాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
జెడ్డాలో జరిగిన రెండవ సముద్ర పరిశ్రమల సమావేశంలో బహ్రెయిన్ రవాణా, టెలికమ్యూనికేషన్ల మంత్రి డాక్టర్ షేక్ అబ్దుల్లా బిన్ అహ్మద్ అల్ ఖలీఫా పాల్గొన్నారు. రెండు దేశాల మధ్య సముద్ర సంబంధాలను బలోపేతం చేయడం ఈ చొరవ లక్ష్యం అని ఆయన అన్నారు.
కనెక్టివిటీని మరింత పెంచే అవకాశం ఉన్న కింగ్ హమద్ కాజ్‌వే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం బహ్రెయిన్ ఖలీఫా బిన్ సల్మాన్ పోర్టును దమ్మామ్‌లోని కింగ్ అబ్దులాజీజ్ పోర్టుతో అనుసంధానించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండు దేశాల మధ్య ప్రయాణీకులు, కార్గో రవాణాను విస్తరించడానికి అవకాశం కల్పిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







